టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే టీం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన “భలే భలే బంజారా” సాంగ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇరగదీశారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన పాపులర్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తాజాగా “భలే భలే బంజారా” సాంగ్ లిరిక్స్ ను షేర్ చేశారు.
Read Also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో
కొరటాల శివ దర్శకత్వం వహించిన “ఆచార్య” చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. కాగా ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ ట్రైలర్ కు మంది ఆదరణ లభించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఆచార్య”కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Bhale Bhale Banzara Lyrics.. pic.twitter.com/cxz9o3ssJ5
— RamajogaiahSastry (@ramjowrites) April 20, 2022