YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్‌లో ‘నందూస్ వరల్డ్’ ఛానల్‌తో ఆదరణ దక్కించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదురవడానికి కొద్ది నిమిషాల ముందే నేను విమానాశ్రయంలో అడుగుపెట్టాను. నేనేదో టీవీ షోల కోసమో, పబ్లిసిటీ కోసమో ముందుకు రాలేదు. నిజానికి ఎన్నో అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి, ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని నేనే స్వయంగా ముందుకొచ్చాను. మా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి మా పేర్లను, పరువును కావాలనే లాగుతున్నారు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, “నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం కోసం నిలబడతాను, ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు కచ్చితంగా జవాబుదారీ అవుతారు. ఇది నేనేదో సీన్ క్రియేట్ చేయడం కోసం కాదు.. నా కుటుంబ గౌరవాన్ని, నిజాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న పోరాటం. కన్నీళ్లు రావచ్చు, ఎంతో బాధ కలగవచ్చు, గడ్డు పరిస్థితులు ఎదురవ్వచ్చు.. కానీ నేను చేయని తప్పుకు ఎప్పటికీ తలదించను. కుంగిపోతానేమో కానీ ఓడిపోను.. నిటారుగా నిలబడి పోరాడతాను” అని రమా నందన స్పష్టం చేశారు.
Also Read
యూకే జాబ్స్, వీసా స్పాన్సర్షిప్ వివాదంలో కేసులు నమోదై, ఎయిర్‌పోర్టులో లుకౌట్ నోటీసుల వ్యవహారం నడిచిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. తనపై కావాలనే కుట్ర జరిగిందని, అసలు దోషులు వేరే ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె నిర్దోషిత్వాన్ని నమ్ముతూ ఫాలోవర్లు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా, మరోవైపు బాధితులు మాత్రం చట్టపరంగా నిజాలు తేలాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!