NTV Telugu Site icon

Adipurush AI Photos: అవన్నీ గ్రాఫిక్స్ రా.. ఒరిజినల్ అంతేమి లేదిక్కడ

Prabhas

Prabhas

Adipurush AI Photos: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మలేనప్పుడు.. ఇలా మనసులో అనుకున్నవి చేసేయగలదు. ఆలోచనలు, నడవడిక.. ఒకటి అని కాదు అందుకే దాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నారు. దీని వలన ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది వచ్చాక పనులు సులువు అయ్యాయి. అన్ని దేశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అప్పటి కాలంలో మనుషులు ఎలా ఉంటారు.. ? వేరే దేశంలోని వారు మన సాంప్రదాయ బట్టలో ఎలా ఉంటారు..? అనేది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఎంతో చక్కగా తెలుసుకోవచ్చు. నిజం చెప్పాలంటే.. మనం కూడా అంత బాగా వస్తాయని అస్సలు ఊహించలేం. కొన్ని రోజుల క్రితం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స ద్వారా యుక్త వయస్సులో రాముడు ఇలా ఉంటాడు అని సోషల్ మీడియాలో ఒక ఫోటో ట్రెండ్ అయ్యింది. అందరికి గుర్తుండే ఉంటుంది. హా ఇప్పుడు అదే AI టెక్నలాజీతో ఆదిపురుష్ టీమ్ ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Akkineni Nagarjuna: నాగ్ మామ ఏంట్రా.. ఇలా మారిపోయాడు

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక వీరి ముగ్గురు AI టెక్నాలజీలో చూస్తే ఇదుగో ఇలా ఉంటారు. నిజంగా ఎంతో అందంగా ఉన్నారు కదా. ముఖ్యంగా ప్రభాస్. రాజసం ఉట్టిపడే నగుమోము.. అందమైన రూపకట్టు.. ఎంతో అందంగా ఉన్నాడు. ఇక కృతి.. అందానికే అసూయ పుట్టేలా ఉంది. ఇక రావణాసురుడుగా సైఫ్ అయితే మహా అద్భుతంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అవి గ్రాఫిక్స్ రా.. ఒరిజినల్ అంతేమి లేదిక్కడ అంటూ ఉండగా.. నిజంగా వీరు ఆదిపురుష్ లో ఇలాగే ఉంటే ఎంత బావుండో అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Show comments