NTV Telugu Site icon

BoyapatiRAPO: ఏం..బోయామామ.. మా రామ్ ను ఆ పనికూడా చేయనివ్వడం లేదా..?

Ram

Ram

Boyapati Srinu: భద్ర సినిమాతో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు బోయపాటి శ్రీను. మాస్.. కాదు కాదు .. హీరోలను ఊర మాస్ గా చూపించడంలో బోయపాటి తరువాతనే ఎవరైనా.. లెజెండ్, అఖండ, సరైనోడు, వినయ విధేయ రామ.. ఇలా స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసిన ఘనత బోయపాటిదే అని చెప్పాలి. నా సినిమాల్లో హీరోలు ఏదైనాచేస్తారు. సాధారణంగా అభిమానులు.. తమ హీరోలు అన్ని దాటుకొని విలన్స్ ను చితకబాదాలని, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సాహసాలు చేయాలనీ ఊహించుకుంటారు. ఆ ఉహలనే నేను నిజం చేస్తాను అని తన హీరోల గురించి చెప్పుకొస్తాడు. ఇక అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రం BoyapatiRAPO. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కోసం ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Heroines In Naked: దానికోసం బట్టలు విప్పడానికైనా రెడీ అంటున్న హీరోయిన్లు

ఇక నేడు డైరెక్టర్ బోయపాటి శ్రీను పుట్టినరోజు. ఉదయం నుంచి అభిమానులతో పాటు కుర్ర హీరోలు, బోయపాటి దర్శకత్వంలో నటించిన హీరోలు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా రాపో కూడా తన డైరెక్టర్ కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. ” హ్యాపీ బర్త్ డే బోయాపాటి గారు.. ప్రతి ఒక్కరు.. మీ చూపులో ఉన్న మ్యాడ్ నెస్ ను నాలో చూడడానికి ఎదురుచూడలేకపోతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివరన.. ” దయచేసి రేపు షూటింగ్ క్యాన్సిల్ చేస్తే ఒక్కసారైనా ప్రశాంతంగా నిద్రపోతాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ ఫ్యాన్స్ బోయపాటిపై సరదాగా యుద్ధం ప్రకటించారు.. ఏం..బోయామామ.. మా రామ్ ను ఆ నిద్ర కూడా పొన్నివ్వడంలేదా..? అని కొందరు. నిద్ర కూడా లేకుండా ఏం చేయిస్తున్నావ్ రామ్ తో బోయపాటి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Show comments