‘రెడ్’ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ “వారియర్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు అఫిషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ టైటిల్ తన సినిమాది అంటూ మరో హీరో ముందుకు రావడంతో కాస్త గందరగోళం నెలకొంది. హవీష్ అనే యంగ్ హీరో “వారియర్” అనే టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే సినిమా డీటెయిల్స్ ను కూడా ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. రామ్ సినిమా టైటిల్ ప్రకటిస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇలా జరగడం ఆయన అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది మొదలుకొని ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రారంభించినప్పుడు కథ కాపీ వివాదంలో చిక్కుకుంది. అది దాటగానే రామ్ మెడకు గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని ఇటీవలే కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టాడు. ఈ విషయంపై ‘రాపో19’ టీం స్పందించలేదు గానీ మరి ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్టబోతున్నారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా…
Read Also : రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్
ఈరోజు ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. “ది వారియర్” అంటూ వారియర్ కు ముందు ది యాడ్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ముందుగా అనుకున్న టైటిల్ లో పెద్దగా చేంజెస్ చేయకుండానే దాదాపుగా అదే టైటిల్ తో కొత్తగా పోస్టర్ లో టైటిల్ తో పాటు రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసి అందరినీ థ్రిల్ చేశారు. రామ్ పోతినేని మందపాటి మీసాలు, క్లీన్ షేవ్ గడ్డంతో డైనమిక్ పోలీస్‌గా సీరియస్ లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. శ్రీనివాస చిట్టూరి తన హోమ్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏదైతేనేం టైటిల్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలివిగా “Warrior” టైటిల్ సమస్యను తీర్చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించే రామ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
