NTV Telugu Site icon

Ram Pothineni: ఉస్తాద్.. ఈసారి గట్టిగా ఇవ్వాలి.. గుర్తుపెట్టుకో

Ram

Ram

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.గతేడాది నుంచి రామ్ ఒక భారీ విజయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ హిట్.. స్కంద సినిమాతో వస్తుందేమో అనుకున్నాడు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను- రామ్ కాంబో అంటే.. అఖండ కన్నా మాస్ హిట్ అందుకుంటుందేమో అనుకున్నారు. కానీ, ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక ప్రస్తుతం రామ్ అభిమానులందరూ.. డబుల్ ఇస్మార్ట్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. రామ్ ను ఊర మాస్ ఉస్తాద్ గా మార్చింది ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతటి భారీ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత పూరి.. డబుల్ ఇస్మార్ట్ ను టేకోవర్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు స్కంద మోడ్ లో ఉన్న రామ్.. ఇప్పుడు ఉస్తాద్ మోడ్ లోకి మారిపోయాడు.

Biggboss Sivaji: మిడిల్ క్లాస్ బయోపిక్.. చాలాకాలం తరువాత హీరోగా శివాజీ

తాజాగా తన ట్విట్టర్ లో ఉస్తాద్ లా మారిన ఫోటోను షేర్ చేస్తూ.. నేను మళ్లీ వచ్చాను అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ ఫొటోలో డబుల్ ఇస్మార్ట్ లుక్ లో రామ్ కనిపించాడు. ప్రింటెడ్ షర్ట్.. 6 ప్యాక్.. ఇస్మార్ట్ శంకర్ లుక్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలి.. గుర్తుపెట్టుకో అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పూరి – రామ్ ఇద్దరు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.