Site icon NTV Telugu

The Warrior Teaser: వీలైతే మారిపోండి.. లేదా పారిపోండి

The Warrior Teaser

The Warrior Teaser

రామ్ పోతినేని, ఎన్. లింగుస్వామి కాంబోలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కెరీర్‌లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించిన రామ్.. ఈ టీజర్‌లో ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్ సూపర్బ్‌గా ఉన్నాయి.

గత కొంతకాలం నుంచి మనం మిస్ అవుతోన్న ఎనర్జిటిక్ రామ్ ఇందులో కనిపించాడని చెప్పొచ్చు. డైలాగులు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా.. ‘డియర్ గ్యాంగ్‌స్టర్స్, వీలైతే మారిపోండి లేదా పారిపోండి, ఇదే నేను మీకిస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ గ్రేస్‌తో రామ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. హీరోయిన్ కృతి శెట్టి రెండు, మూడు ఫ్రేమ్స్‌లో అందంగా తళుక్కున మెరిసింది. ఇక విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి రగ్డ్ లుక్‌లో అదరహో అనిపించాడు. హీరో – విలన్ కాంబోగా రామ్ – ఆది జోడీ బాగానే కుదిరిందని చెప్పుకోవచ్చు.

కాగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నదియా, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జులై 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version