దేవదాసు చిత్రంతో తెలుసు తెరకు పరిచయమయ్యాడు రామ్ పోతినేని. తోలి సినిమాతోనే హిట్ ను అందుకున్న రామ్ ఆనతి కాలంలోనే ఎనర్జిటిక్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బారి విజయాన్ని అందుకొని ఉస్తాద్ రామ్ గా మారిపోయాడు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న చిత్రం ది వారియర్. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ లో రామ్ తన పెళ్లిపై స్పందించాడు.
గత కొన్ని రోజుల క్రితం రామ్ తన ఇంటర్ క్లాస్ మేట ను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.. అయితే ఈ వార్తలను ట్విట్టర్ ద్వారా కొట్టివేసిన రామ్.. తాజాగా ఈ ఈవెంట్ లో కూడా ఖండించాడు. సుమ అడిగిన మూడు ప్రశ్నలకు అంతే క్రేజీగా ఆన్సర్స్ చెప్పి ఔరా అనిపించాడు. సాంబార్ ఇష్టమా.. బిర్యానీ ఇష్టమా అంటే బ్రేక్ ఫాస్ట్ కు సాంబార్ ఇడ్లీ.. మధ్యాహ్నం బిర్యానీ అంటూ స్మార్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఇంటర్ మీరు చదివి ఫెయిల్ అయ్యారా..? లేక అసలు కాలేజ్ కు కూడా వెళ్లకుండా ఫెయిల్ అయ్యారా..? అంటే కాలేజ్ కు వెళ్లినా ఫెయిల్ అయ్యేవాడినేమో.. అందుకే నా 15 వ ఏటనే చౌదరి గారు నన్ను చెన్నై తీసుకెళ్లిపోయారు అంటూ నవ్వేశాడు. ఇక చివరగా మీ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. రామ్ పెళ్లి ఎప్పుడు..? అని అడగగా.. కొన్నింటికి సమాధానాలు ఉండవు.. జరిగినప్పుడే అంటూ ఇస్మార్ట్ శంకర్ స్మారూట్ గా తప్పించుకున్నాడు.