NTV Telugu Site icon

Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి

Ram

Ram

Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్లు.. ఒక హిట్ కొట్టేవరకు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ హిట్టు దక్కింది అంటే.. తిట్టినా నోర్లే పొగడడం మొదలుపెడతాయి. నువ్వు హీరోయినా అన్న వారే .. ఈమె హీరోయిన్ అంటే అని చెప్పుకొస్తారు. ఇక తాజగా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వైష్ణవి చైతన్య. ఒక చిన్న యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ మూవీతో హీరోయిన్ గా మారింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ భారీ విజయాన్ని అందుకుంది. ఇద్దరు అబ్బాయిలను మోసం చేసిన యువతిగా వైష్ణవి నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఈ సినిమాను అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ .. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చిత్ర బృందాన్ని ప్రశంసించిన విషయం తెల్సిందే.

Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే

ఇక తాజాగా బేబీ మూవీని ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రశంసించాడు. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ..వైష్ణవికి బొకే పంపించాడు. ఇక ఈ విషయాన్నీ వైష్ణవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ” బేబీ టీం ను అభినందిస్తూ పూలు పంపినందుకు థాంక్యూ రామ్ గారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ పూలను పట్టుకొని వైష్ణవి గాల్లో తేలిపోయింది. ఇక వైష్ణవి ఫేవరేట్ హీరో రామ్.. ఈ విషయాన్నీ ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో తన అభిమాన హీరో దగ్గరనుంచి బొకే రావడంతో వైష్ణవి మరింత ఉబ్బితబ్బుబ్బిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.