Site icon NTV Telugu

Ram Gopal Varma: OG గ్లింప్స్ పై వర్మ షాకింగ్ రివ్యూ.. అస్సలు ఊహించలేదే

Vihsnu

Vihsnu

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వర్మనే గుర్తుకువస్తారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లను అందించిన వర్మ .. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి .. ప్రేక్షకులను విసిగిస్తున్నాడు అనేది నెటిజన్ల మాట. ఇక ఇవే కాకుండా పొలిటికల్ గా జగన్ కు సపోర్ట్ చేస్తూ ప్రతి పక్షాలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. పవన్ ఫ్యాన్ ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా కూడా వర్మకు ఇసుమంతైనా పట్టింపు లేకుండా .. పవన్ గురుంచి సినిమాలు తీయడం .. ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా అలాంటి వర్మ.. నేడు పవన్ కళ్యాణ్ బిధ్ డే కు విష్ చేశాడు. అంతేకాకుండా పవన్ నటించిన OG సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను కూడా మెచ్చుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్విట్టర్ వేదికగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

RC 16 : మరోసారి రాంచరణ్ తో కలిసి నటించబోతున్న చిరంజీవి..?

“ఇది మీకు హ్యాపీయెస్ట్ బర్త్ డే అయ్యి ఉండాలి పవన్ కల్యాణ్. OG గ్లింప్స్ .. ఈ ప్రపంచానికి దూరంగా ఉంది. పవన్ కళ్యాణ్ అన్ని ట్రైలర్స్ లో నేను చూసిన బెస్ట్ అంటే ఇదే .. హే..సుజీత్.. యూ కిల్లీడ్ ఇట్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు పవన్ ను తిట్టేవాడు.. ఈసారి ఏంటి పొగిడేశాడు. ఇది అస్సలు ఊహించలేదు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క సర్లే.. చెప్పాడుగా థాంక్స్ చెప్దామని ఫ్యాన్స్ అందరు వర్మకు థాంక్స్ చెప్తున్నారు.

Exit mobile version