NTV Telugu Site icon

Ram Gopal Varma: వర్మ.. నవీన్ హత్యకేసుపై ఓ సినిమా తీస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం

Varma

Varma

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది ఉందో వోడ్కా తాగేసి మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పుకొస్తాడు. అయితే కొన్నిసార్లు పాజిటివ్ గా ఇంకొన్ని నెగెటివ్ గా ఉండడంతో అభిమానులు ఎప్పుడు వర్మ ఎలా ఉంటాడో అర్ధం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. మొన్నటివరకు కుక్కలు.. మేయర్ వెనుక పడ్డ వర్మ.. తాజాగా నవీన్ హత్య కేసు మీద పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడును చంపేసిన హరిహర కృష్ణ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. ఆ స్టోరీని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.

Siddharth-Aditi: ఇక్కడ పవిత్ర- నరేష్.. అక్కడ సిద్దార్థ్- అదితి.. పవిత్ర బంధమట

హరిహర కృష్ణ, నవీన్, నిహారిక ఫోటోలను చూపిస్తూ.. ఈ అమ్మాయి కోసం కింద ఉన్న యువకుడు పైనున్న యువకుడును హత్య చేశాడు. ప్రేమ గుడ్డిది అని నాకు తెలుసు కానీ.. మరీ ఇంత గుడ్డిది అని తెలియదు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయి అందంగా లేదు అంటే.. అందంగా ఉంటే చంపినా తప్పు లేదా అని కొందరు. ఇంకే ఇంకో కొత్త సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయ్యింది.. ఇక మొదలుపెట్టు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. నవీన్ హత్యకేసు గురించి అందరికి తెల్సిందే. హరిహర కృష్ణ, నిహారిక ప్రేమికులు.. హరిహరి కృష్ణ స్నేహితుడు అయిన నవీన్.. నిహారికతో చనువుగా ఉంటున్నాడని ప్లాన్ వేసి నవీన్ అతి క్రూరంగా హరిహర కృష్ణ హత్య చేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి విసిరేశాడు. ప్రస్తుతం హరిహర కృష్ణ, నిహారిక జైల్లో ఉన్నారు.