Site icon NTV Telugu

Ram Gopal Varma: నేడు పోలీసు విచారణకు హాజరుకానున్న రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ!

Rgv

Rgv

Ram Gopal Varma: గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు రాంగోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేస్తూనే పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. కానీ, గతంలో ఆర్జీవీ పలుమార్లు పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు.

Read Also: OTT : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’.. ఫ్యాన్స్ షాక్

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల పోలీసుల నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించిన రాంగోపాల్ వర్మ 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని పోలీసులను కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాంగోపాల్ వర్మ శుక్రవారం పోలీసు విచారణకు హాజరుకానున్నారు. తాను ఇవాళ విచారణకు హాజరవుతానని విచారణాధికారి సీఐ శ్రీకాంత్‌కు ఆర్జీవీ సమాచారం అందించారు. అయితే ఈ రోజు ఆర్జీవీ విచారణకు వస్తారా? మళ్లీ డుమ్మాకొడుతారా? అనే విషయంపై అంతా ఉత్కంఠ నెలకొన్నది. దీనికి తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Exit mobile version