Site icon NTV Telugu

RGV: మెగా బెగ్గింగ్‌తో హర్ట్ అయ్యా.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు

Chiranjeevi-and-RGV

నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌తినిధుల బృందం భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం, 10 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Read Also : Khiladi కిక్ వెస్ట్ బెంగాల్ లో… రవితేజ ఫ్యాన్స్ డిమాండ్

“సర్ చిరంజీవి గారు, నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్‌తో మెగా హర్ట్ అయ్యాను” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ట్వీట్ తో పాటుగా వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల బృందం సమావేశానికి సంబంధించిన వీడియో లింక్‌ను కూడా పంచుకున్నాడు. దీంతో ఆయన డైరెక్ట్ గా చిరంజీవిని స్పష్టంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను ఆర్జీవీ తొలగించడంతో అతని ప్రవర్తనపై చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version