Ram Gopal Varma says Jai Balayya: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అయితే కలకలం రేపుతున్నాయి. ముందుగా “నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు, అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు కూడా నేనంటే ఎంతో ఇష్టం అని అంటూనే ఫైనల్గా నా డ్రీమ్ అయిన డల్లాస్ లో బేబీ డాల్స్ పబ్ కి వెళ్లానని అంటూనే అక్కడ ఎంతో ఆనందంగా ఉందని ఆయన రాసుకొచ్చారు. అంతేకాదు పబ్ లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ దిగి ఎంజాయ్ చేసినట్లు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు అలా షేర్ చేస్తూ అసలు ఈమె నిజమైనా వ్యక్తేనా లేదా బొమ్మనా అని చెక్ చేశాను.
Nandamuri Balakrishna: మనవడితో హాలిడేకు చెక్కేసిన బాలయ్య..
ఫైనల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి అని రియలైజ్ అయ్యాను” అంటూ ఓ అమ్మాయి నాభి స్థానంలో తాకుతున్న ఫోటోను షేర్ చేశారు. అయితే ఆమె అమ్మాయే అయినా వర్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన అమ్మాయి అని కామెంట్ చేశారు. ఇక బేబీ డాల్స్ పబ్ లో ఉన్న అమ్మాయిలతో సెల్ఫీ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ ఆర్జీవీ గురించి రకరలలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ పబ్ అమెరికాలో చాలా ఫేమస్ అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే సందు దొరికుఇతే బాలకృష్ణ అలాగే టీడీపీని ఆడుకోవడానికి ప్రయత్నించే వర్మ ఇప్పుడు మాత్రం జై బాలయ్య అంటూ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో కొందరు కుర్రోళ్ళతో కలిసి రామ్ గోపాల్ వర్మ టపాసులు పేలుస్తూ కనిపిస్తున్నారు.
Jai Balayya pic.twitter.com/DyfJzzYfTF
— Ram Gopal Varma (@RGVzoomin) July 6, 2023