వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ఒకప్పుడు సైకిల్ చైన్ తో యూత్ లో ఉన్న ‘శివ’ను బయటకు తీసుకొచ్చాడు. అప్పట్లో వర్మ మేనియా గట్టిగానే నడిచింది. అలా చాలా కాలం పాటు వర్మ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన నుంచి అనుకోని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫట్ అయినా వర్మకు ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ అభిమానులుగానే ఉన్నారు. తాజాగా ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని తన అభిమానాన్ని చాటుకుంటూ ట్వీట్ చేశాడు. అందులో ఆయనలోని కవిని బయట పెడుతూ “సైకిల్ చైనుతొ సినిమా… సైకీనే మార్చి వేసి చరితాత్ముండై… జైకొట్టిన ఛీకొట్టిన… రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే” అంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేశాడు. దానిని రీట్వీన్ చేసిన వర్మ ఆ అభిమానికి వెరైటీ రిప్లై ఇచ్చారు.
Read Also : RRR : ఎన్టీఆర్ పై డామినేషన్… చెర్రీ రియాక్షన్ కు ఫిదా
తాను రాముడిని కాదని, రావణుడిని అని చెప్పుకొచ్చారు. ఇంతకీ వర్మ రిప్లై ఏమిటంటే… “అంతా బాగానే ఉంది కానీ రావణుడితో పోల్చితే నేను మరింత కంఫర్టబుల్ గా ఉంటాను” అని రిప్లై ఇచ్చారు. సాధారణంగానే వర్మ సమాధానాలు భిన్నంగా ఉంటాయి. మరి ఆయన నుంచి ఇలాంటి సమాధానం రావడం పెద్దగా ఆశ్చర్య పోనవసరం లేని విషయమని చెప్పొచ్చు. కాగా వర్మ ఇప్పుడు “డేంజరస్” అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. నైనా గంగూలీ, అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందగా, సినిమాకు తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తున్నారు వర్మ.
All well but I will be more comfortable in comparison with Ravana https://t.co/KgwFVxjlbF
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022