“ఆర్ఆర్ఆర్”తో ఒమిక్రాన్ కు చెక్… ప్రభుత్వానికి ఆర్జీవీ సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా. అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ పట్టుకుంది. దీంతో సినిమాను ప్రజల జాగ్రత్త కోసం ఎలా వాడుకోవచ్చో తెలుపుతూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు.
I have a GREAT idea for the GOVERNMENT regarding OMICRON😎😎😎…They should not allow anyone into #RRR theatres unless they show proof of DOUBLE DOSE ..The DESIRE to see #RRR will CONQUER the CARELESSNESS of the PEOPLE 💪💪💪
Also Read
- Rajini - Kamal Movie Update: రజినీ - కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్... మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
- Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
- Peddi : 'పెద్ది' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2021
“ఒమిక్రాన్ గురించి ప్రభుత్వానికి చెప్పడానికి నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది. ప్రేక్షకులను డబుల్ డోస్ వేసుకున్నట్టుగా రుజువు చూపితే తప్ప #ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి అనుమతించకూడదు. అప్పుడు #ఆర్ఆర్ఆర్ ను చూడాలనే కోరిక ప్రజల అజాగ్రత్తను జయిస్తుంది” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్‌తో హెడ్‌లైన్స్‌లో ఉంటాడన్న విషయం తెలిసిందే. మరోవైపు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్’ వాయిదా పడుతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
తాజావార్తలు
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!