బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్ రామ్. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ అంటూ వార్తలు.. మేనల్లుడు బహిరంగ క్షమాపణ
ఈ సినిమా జనవరి 10 2025వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత రామ్ చరణ్ తేజ చేస్తున్న పూర్తిస్థాయి సోలో ఫిలిం ఇదే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన జరగండి, రారా మచ్చా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హక్కులను భారీ రేటుకి అనిల్ తడాని ఏఏ ఫిలింస్ సంస్థ దక్కించుకుంది. ఒకరకంగా ఈ సంస్థ ద్వారా గేమ్ చేంజెర్ సినిమాని నార్త్ లో గట్టిగానే రిలీజ్ చేయబోతున్నారని చెప్పవచ్చు.