Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 11 ఏళ్ళ క్రితం తన స్నేహితురాలు అయిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నేళ్లకు ఉపసన- చరణ్ తల్లితండ్రులు కాబోతున్నారు. గతేడాది చివర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని చెప్పి మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అప్పటినుంచి ఉపాసనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు చరణ్. ఇక ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన బిడ్డ గురుంచి , చరణ్ గురించి పోస్ట్లు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన.. మొదటిసారి తన ప్రెగ్నెన్సీ గురించి చరణ్ కు చెప్పినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడో చెప్పుకొచ్చింది.
Gunturu Kaaram: ‘గుంటూరు కారం’ షూటింగ్ అప్డేట్..
” చరణ్ .. నేను ప్రెగ్నెంట్ అయ్యానని అనిపిస్తుంది అని చెప్పగానే.. చరణ్ .. నువ్వు ముందు కంగారు పడకు.. టెస్టులు అన్ని చేయిద్దాం.. అంతా బావుంది అనుకున్నాకే ఇంట్లో చెబుతాం అన్నాడు. అందుకే నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. ఆయనను ఆరాధిస్తాను. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా తీసుకుంటాడు. నేను ఎలాంటి విషయాన్ని చెప్పినా.. కూల్ గా నాకు చెప్తాడు. అతని వలనే నేను జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నా మనసులో మాటలను చరణ్ కు చెప్పడం నాకు ఇష్టం.. అతను తనదైన శైలిలో వాటికి సమాధానాలు చెప్పి నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో చరణ్ మరో గ్లోబల్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.