Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో నిర్వహించిన ఈ సర్జరీ అనంతరం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మొదటిసారి ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.
ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెజెండరీ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అత్యంత క్లిష్టమైన వెన్నెముక సమస్యను కూడా ఈయనే విజయవంతంగా నయం చేశారు. రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు రప్పించారు. విజయవంతం సర్జరీ పూర్తి అయిన తర్వాత ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
తాజావార్తలు
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!