Ram Charan, Upasana celebrate X Mas with Klinkara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఆయన భార్య ఉపాసన తమ జీవితంలోని ఒక స్పెషల్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతల్లో మునిగితేలుతున్నారు. జూన్ 20న వారు క్లింకరాకు తల్లి తండ్రులు అయ్యారు, అప్పటి నుంచి పాపకు సంబందించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ కుమార్తె గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఈ జంట క్లింకారాను మీడియా దృష్టి నుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు, ఆమె ఫోటోలను తీయవద్దని ఫొటోగ్రాఫర్ లను కోరుతున్నారు. ఇక ఇటీవల, ఈ జంట క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఈ వేడుక జరుపుకుంటారు. కానీ రామ్ చరణ్ ముంబై వెళ్లడంతో ఆయన వెంట అక్కడికి వెళ్లిన ఉపాసన సోషల్ మీడియాలో తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.
Salaar: సలార్ మరో సెన్సేషన్… తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డు బ్రేక్
ఆ ఫొటోల ప్రకారం ఉపాసన ఎరుపు రంగు దుస్తులు ధరించి, అందమైన చిరునవ్వుతో ప్రకాశవంతంగా కనిపించగా, రామ్ చరణ్ నలుపు రంగు సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోలతో ఉపాసన వారి పెంపుడు కుక్క రైమ్‌ను పట్టుకుంది, రామ్ చరణ్ ఏమో కెమెరా కంట పడకుండా క్లింకారాని ఎత్తుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “గేమ్ ఛేంజర్”తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఆ సినిమా కాకుండా నిజ జీవిత సంఘటనల ఆధారంగా బుచ్చి బాబు సనా రాసుకున్న ఒక కథలో కూడా హీరోగా కనిపించబోతున్నాడు. ఇక మెగా సెలబ్రేషన్స్ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.