Salaar Becomes 4th Day Highest Share Collecetd Movie by Crossing RRR: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాకి క్రిస్టమస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కువగా పడుతున్నాయి. ఇక ఈ సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్న రికార్డును ఈ సలార్ సినిమా బద్దలు కొట్టింది. ఏపీ తెలంగాణలో కలిపి 4వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్టు ఈ మేరకు ఉంది. 18.05 కోట్లతో సలార్ మొదటి ప్లేసులో ఉండగా ఆర్ఆర్ఆర్ 17.73 కోట్లతో రెండో ప్లేసులో ఉంది.
Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?
ఇక తరువాత బాహుబలి2 – 14.65 కోట్లు, సర్కారు వారి పాట – 12.06 కోట్లు, అలవైకుంఠపురములో – 11.56 కోట్లు, వాల్తేర్ వీరయ్య – 11.42 కోట్లు, కేజీఎఫ్ 2 (డబ్) – 10.81 కోట్లు, సాహో – 9.60 కోట్లు, సరిలేరు నీకెవ్వరు- 8.67 కోట్లు, మహర్షి – 8.44 కోట్లు, అఖండ- 8.31 కోట్లు షేర్ సాధించి టాప్ టెన్ నాలుగో రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఇక సలార్ సినిమా టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్ రెండు భాగాలుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. మొదటిది ‘సాలార్- సీజ్ ఫైర్(కాల్పుల విరమణ)’ కాగా రెండవది ‘సాలార్ – శౌర్యాంగ పర్వం.’ ప్రభాస్ దేవా అలియాస్ సాలార్ పాత్రలో నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ వరద రాజ మన్నార్‌గా, జగపతి బాబు రాజమన్నార్‌గా, శృతి హాసన్ ఆద్యగా కనిపించారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది.