NTV Telugu Site icon

Ram Charan: మంగళవారం కు మరింత బూస్ట్ తెచ్చిన చరణ్..

Charan

Charan

Ram Charan: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది. ఆర్ఎక్స్ 100 తరువాత అజయ్ భూపతికి, పాయల్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ బావుందని చూసినవారు చెప్పుకొస్తున్నారు. ఇక అభిమానులతో పాటు చాలామంది సెలబ్రిటీలు సైతం మంగళవారం సినిమాకు పాజిటివ్ రివ్యూలు అందించడమే కాకుండా.. పాజిటివ్ టాక్ వచ్చినందుకు చిత్ర బృందానికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మంగళవారం సినిమాపై ట్వీట్ చేశాడు. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. మొదటి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్న స్వాతి గునుపాటిని అభినందించాడు.

Perfume: పర్‌ఫ్యూమ్ సాంగ్ రిలీజ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ భోలే షావలీ

“తన తొలి నిర్మాణంతోనే హిట్ చిత్రాన్ని అందించినందుకు నా ప్రియ స్నేహితురాలు స్వాతి గునుపాటికి అభినందనలు తెలుపుతున్నాను. మంగళవారం కంటెంట్ గురించి మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.సాంకేతిక విభాగాలు, ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం మరియు సినిమాటోగ్రఫీ చాలా బావుందని నేను విన్నాను. ఈ సినిమా చూడడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అజయ్ భూపతి, పాయల్, నందితా శ్వేతా.. మీకు నా అబినందనలు” అని చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ ట్వీట్ తో మంగళవారంకు మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. గతవారం వరల్డ్ కప్ వలన కలక్షన్స్ కొంచెం డల్ అయ్యాయి. ఈ వారం కలక్షన్స్ ఎలాఉండనున్నాయో చూడాలి.