Perfume: చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పర్‌ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్ పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఈ స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ మీద అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అసలు దీని కథ ఏంటి? అన్నది నవంబర్ 24న అందరికీ తెలియనుంది. భారీ ఎత్తున ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది.. ఇక తాజాగా ఈ సినిమాలోని మాస్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, భోళే షావలీ కలిసి రిలీజ్ చేశారు.
Joruga Husharuga: బేబీ బాయ్ ఫ్రెండ్ విరాట్.. జోరుగా హుషారుగా వస్తున్నాడు
టైటిల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ పర్‌ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేశారు. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. వరం, కీర్తన శర్మ ఆలపించారు. ఈ పాటను భీమ్స్, భోళే షావలీ కలిసి రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ పాట ఫుల్ క్రేజీగా కనిపిస్తోంది. శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.