KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం 06:40 గంటలకు KGF 2 తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నిర్మాత మరియు దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్న గ్రాండ్ ఈవెంట్‌లో కన్నడ ట్రైలర్‌ను కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించగా, ఈ ఈవెంట్ కు తెలుగు విలేఖరులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలుగు విలేఖరుల బృందం బెంగుళూరు చేరుకుంది.
Read Also : Allu Arjun and Kalyan Ram : షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు… హీరోలకు జరిమానా
KGF మొదటి భాగం అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో KGF Chapter 2పై అభిమానులు, ప్రేక్షకులు అంచనాలు రెట్టింపు అయ్యాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు, ఈ యాక్షన్ డ్రామాకి రవి బస్రూర్ సంగీతం అందించారు.
