NTV Telugu Site icon

Ram Charan: పాపులర్ షోకి గెస్టుగా మెగా పవర్ స్టార్…

Ram Charan

Ram Charan

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ US వెళ్లాడు.

Read Also: Ram Charan: అయ్యప్ప మాలలో ఆస్కార్స్ కి…

అక్కడ ABC (American Broadcasting Channel) ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది. బుధవారం చరణ్, ఈ షోకి గెస్టుగా వెళ్లనున్నాడు. 1975 నుంచి సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకి USలో మంచి డిమాండ్ ఉంది. మైఖేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో రెండు గంటల పాటు ఎయిర్ అవుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ RRR చిత్రంలో పనిచేసిన అనుభవం మరియు అతని రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలని కూడా చరణ్, US ఆడియన్స్ తో పంచుకోబోతున్నాడు.

Read Also: Ram Charan: ఒక్క సినిమా కోసం ఇన్ని గెటప్స్ ఏంటయ్యా… చరణ్ న్యూ లుక్ చూసారా?

Show comments