NTV Telugu Site icon

Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ప్రస్తుతం తల్లితండ్రులుగా మారిన విషయం తెల్సిందే.మెగా ప్రిన్సెస్ క్లింకారా ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడం లేదు ఈ జంట. ఈ అపురూపమైన క్షణాల కోసం ఈ జంట 11 ఏళ్లు ఎదురుచూసింది. ఇక ఈ మధ్యనే ఉపాసన తన పుట్టినరోజున. తల్లిగా తానుమళ్లీ ఎలా జన్మించాను అనేది ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. చరణ్- ఉపాసన ది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెల్సిందే. ఒక ఫ్రెండ్ ద్వారా చరణ్ కు ఉపాసన పరిచయం కావడం.. ముందు స్నేహితులుగా ఉన్న వీరు.. తరువాతః ప్రేమలో పాడడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.చరణ్ నిత్యం ఉపాసనతోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. వెకేషన్స్ అని, షాపింగ్ అని భార్యతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనీ చూస్తాడు. ఇక పెళ్ళైన కొత్తలో అయితే ఉపాసనకు మంచి మంచి గిఫ్ట్ లు ఇచ్చేవాడట చరణ్. కానీ, ఆమెకు ఏవి నచ్చేవి కాదని, ఆ విషయంలో ఉపాసన చేత చెంప దెబ్బలు కూడా తిన్నాను అంటూ చరణ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Nithiin: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గా నితిన్.. ఆ లుక్ ఏందీ బ్రో..?

ఒక క్లాత్ బ్రాండ్ కు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా.. ఆ ప్రమోషన్ ఇంటర్వ్యూను కమెడియన్ తన్మయ్ భట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. ఎవరికైనా ఆన్లైన్ షాపింగ్ చేశారా.. ? అన్న ప్రశ్నకు.. ” పెళ్ళైన కొత్తలో ఉపాసన కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ తీసుకున్నాను. దాన్ని వెతకడానికే.. ఐదు గంటలు పట్టింది. అది వచ్చాకా.. ఉపాసనకు ఇచ్చి సర్ ప్రైజ్ చేశా.. కానీ, ఆమె మాత్రం దాన్ని అవతలకు పారేసి.. నన్ను చిన్నగా చెంప దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది. అందుకే ఆడవాళ్లకు సర్‌ప్రైజులు ఇవ్వొద్దు. వారికి కూడా అవి నచ్చవేమో. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments