NTV Telugu Site icon

Ram Charan: ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి కారణం నేను కాదు..

Charan

Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో  తాజాగా  తన తండ్రి చిరుతో కలిసి  ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్ చిత్రంతో చరణ్, తారక్ ల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది అన్న విషయం విదితమే. ఒకరంటే ఒకటికి ఎంత ఇష్టమో వారు చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే . మునుపెన్నడూ తారక్ ఇలాంటి పూజలు, దీక్షలు చేసింది లేదు. అయితే సడెన్ గా ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా.. చాలా ఏళ్ళు చరణ్ తో సహవాసం వలన ఎన్టీఆర్ కు కూడా భక్తి మార్గంపై ఆసక్తి కలిగిందని అభిమానులు చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇక తాజాగా చరణ్ ఈ వార్తలపై స్పందించాడు. ” ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి మీరు ఇన్స్పిరేషనా ..? అని అడుగగా చరణ్ మాట్లాడుతూ” లేదండి.. అలాంటిదేమి లేదు .. తారక్ ఎప్పటినుంచో మాల వేసుకోవాలని అనుకుంటున్నాడు. అది ఇప్పటికి కుదిరింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడంలో చరణ్ పాత్ర ఏమి లేదని తెలుస్తోంది. ఇక దీనిపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మాల్ వేసుకోవడం అనేది వారి వ్యక్తిగతం.. అది ఒకారు చెపితేనో.. ఒకరిని చూస్తేనే రాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.