NTV Telugu Site icon

Ram Charan: చరణ్ కీలక నిర్ణయం.. నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు బ్రో..?

Charan

Charan

Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చరణ్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇకపోతే చరణ్.. వ్యక్తిగత విషయానికొస్తే త్వరలోనే మెగా హీరో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. ఉపాసనకు ప్రస్తుతం ఏడో నెల. పదేళ్ల తరువాత ఉపాసన గర్భవతి అయ్యింది. దీంతో మెగా కుటుంబం తో పాటు మెగా అభిమానులు కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. మొదటిసారి భార్య తల్లి కాబోతుండడంతో చరణ్.. ఒక్క నిమిషం కూడా ఉపాసనను వదిలి ఉండడం లేదు. ఎక్కడకు వెళ్లినా ఆమెతోనే ఉంటున్నాడు. పుట్టబోయే బిడ్డకోసం వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Manchu Mohan Babu: కోడలితో మోహన్ బాబు అలా ఉన్నాడా.. ఇది పెద్ద షాకే

తాజాగా పుట్టబోయే బిడ్డ కోసం చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నాడట. ఉపాసనకు ఇప్పుడు ఏడో నెల.. ఈ సమయంలో భర్తతో ఉండాలని ప్రతి భార్యకు ఉంటుంది. అందుకే భార్య కోరిక తీర్చడానికి చరణ్ ఆ ఉపాసన డెలివరీ అయ్యేవరకు షూటింగ్ అన్నింటికీ బ్రేక్ చెప్పనున్నాడట. మరో మూడు నెలలు షూటింగ్ లో చరణ్ కనిపించడట. ఉపాసనతో కలిసి వెకేషన్స్, ఆమెకు ఏది ఇష్టమైతే దాన్ని చేయాలనీ నిర్ణయించుకున్నాడట. అందుకే గేమ్ ఛేంజర్ ను త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నాడట. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానులు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు. వదినతో సమయం గడుపుతున్నావని సంతోషించాలా..? మూడు నెలలు నీ సినిమా అప్డేట్స్, నీ షూటింగ్ ఫొటోస్ రావని విచారించాలా..? అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.