Manchu Mohan Babu: కోడలితో మోహన్ బాబు అలా ఉన్నాడా.. ఇది పెద్ద షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మంచు బ్రదర్స్ విబేధాలు బయటపడ్డాయి. అయితే అవన్నీ రియాలిటీ షో కోసమని చెప్పి కవర్ చేశారు. త్వరలోనే ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మంచు మనోజ్.. తాను ప్రేమించిన మౌనిక మెడలో ఈ మధ్యనే మూడు ముళ్లు వేసిన సంగతి తెల్సిందే. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు రావడానికి ఈ జంట చాలానే కష్టపడిందట. పెళ్లి తరువాత మనోజ్- మౌనిక మొదటిసారి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో వారిద్దరూ వారి మనోగతాలను బయటపెట్టారు. ముఖ్యంగా మనోజ్.. ఆమె కోసం ఎంత తపించాడో చెప్పుకొచ్చాడు. మొదట తానే మౌనికకు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చిన మనోజ్.. మౌనిక కష్టాలను చూసాక.. నా జీవితంలో చూసిన బాధలు చాలా చిన్నవిగా కనిపించాయని చెప్పుకొచ్చాడు. ” నువ్వంటే ప్రాణం.. జీవితంలో నీ వలనే నేను సంతోషంగా ఉన్నాను. నాకు హ్యాపీగా బ్రతకాలని ఉందని అన్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను. ఎవరు ఏమనుకున్నా ఆలోచించకుండా శివుడికి వినాయకుడు దొరికినట్టు నాకు బాబు దొరికాడు. మా వనవాసం అప్పుడు మొదలయింది. ఉప్పెనలో ఈశ్వరా పాటలా దేశాలు తిరిగేశాం” అని చెప్పుకొచ్చాడు మనోజ్.
Samantha: సామ్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లస్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read
ఇక వీరి పెళ్లికి మంచు కుటుంబం ఒప్పుకోలేదని, మోహన్ బాబు పెళ్ళికి కూడా రాడని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే మోహన్ బాబు.. కొడుకు పెళ్ళిలో రచ్చ చేశారు. కోడలిని ముద్దాడి ఆ పుకార్లకు చెక్ పెట్టాడు. ఇక ఇదే విషయాన్నీ మౌనిక చెప్పుకొచ్చింది. అలాంటి అత్తామామలు దొరకడం తనకు వరమని చెప్పింది. మోహన్ బాబు అయితే .. తన కొడుకును కూడా సొంత మనవడు లానే చూసుకుంటున్నట్టు తెలిపింది. ” మామయ్య నాతో చాలా సరదాగా ఉంటారు. పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా నాకు భోజనం తినిపించారు. అలాగే అత్తయ్య ఎప్పుడూ నాతో ఫోన్ లో మాట్లాడూ ఉంటుంది. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. నన్ను, నా కొడుకు ధైరవ్ ను వాళ్లిద్దరూ సొంతవాళ్ల మాదిరిగా దగ్గరకు తీసుకున్నారు. అత్తయ్య, మామయ్య నాకు దేవుడిచ్చిన వరం” అని చెప్పుకొచ్చింది. ఇక వీరి మాటలు విన్నాకా అభిమానులందరూ షాక్ అవుతున్నారు. మోహన్ బాబు కోడలిని ఇంత బాగా చూసుకుంటాడా .. ఇది పెద్ద షాకే .. పెళ్లి ఇష్టం లేకుండా చేసుకున్నారని అసలు మాట్లాడరేమో అనుకున్నాం అంటూనెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!