RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో గతంలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఇప్పుడు చరణ్‌తో అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ పై కసరత్తులు చేస్తున్నాడు సుక్కు. ఇప్పటికే కథ విషయమై చరణ్, సుకుమార్ సుదీర్ఘంగా చర్చించుకున్నట్టు టాక్.
అయితే కథా చర్చలు ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మాత్రం దసరా పండగ తర్వాతే ప్రారంభం కానుందని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం రామ్‌చరణ్‌కు అయిన గాయమేనని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో చరణ్ చేతికి గాయమైంది. ఇప్పుడు ఆ చేతికి సర్జరీ చేయించుకోనున్నారు చరణ్. సర్జరీ పూర్తయ్యాక కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో సుకుమార్ ఆర్సీ 17 ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నాడు. కథ, లొకేషన్ల వేట, ఇతర సాంకేతిక పనులు ముగియడానికి దసరా వరకు సమయం పడుతుంది. కాబట్టి అంతా పక్కాగా సిద్ధం చేసుకుని దసరా శుభ ముహూర్తాన ఈ క్రేజీ కాంబోను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఆర్సీ 17 ఎప్పుడొచ్చిన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!