Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ తన సినిమాల లైన్అప్ను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం అంతకుమించిన ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెన్సెషనల్ డైరెక్టర్ నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మెగా పవర్ స్టార్‌తో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చేసిన మాస్ పర్ఫార్మెన్స్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా పెద్ది సినిమాలో చరణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు మించి ఊరమాస్ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్‌ను శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. శ్రీకాంత్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్.. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..