Site icon NTV Telugu

Ram Charan: నాకు, తారక్ కు నీడలా ఉన్నది మీరే..

ram charan

ram charan

ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కర్ణాటకలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. అందరి కన్నా మూడ్ను ఎవరి గురించి మాట్లాడాలో ఆయనే మా బిగ్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్… ఆయన మా కుటుంబ సభ్యులు లాంటివారు. అలాంటి ఆయన ఈరోజు మనదగ్గర లేరు అంటే నేను నమ్మలేకపోతున్నాను.. నమ్మలేను.. నమ్మను కూడా.. తారక్ చెప్పినట్లు ఆయన ఇక్కడే ఉండి మమ్మల్ని చూస్తూ ఉంటారు.

ఆయన లేనిలోటును ఇక్కడ శివరాజ్ కుమార్ గారు తీరుస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసిన తారక్ అభిమానులకు, మెగా అభిమానులకు ధన్యవాదాలు. మీరు లేనిదే మేము లేము.. నిజంగా తారక్ కు, నాకు మీరు ఒక షాడోలా, నీడలా మా వెంట ఉంటున్నారు. మీకోసం ఆఖరికి మార్చి 25 న మేము పడిన కష్టం, శ్రమ సినిమాలో చూస్తారు. రాజమౌళి ఫ్యాబ్రిక్ వర్క్ చూడడానికి మీ అందరు థియేటర్ కి రావాలి. రాజమౌళి టీమ్ అందరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version