‘పెద్ది’ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం #RC17. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అభిమానులను ఖుషీ చేసే కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అల్ట్రా లీన్ అండ్ మాసీ అవతారంలోకి మారబోతున్నారు. పాత్ర అవసరాల కోసం ఆయన ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నట్లు సమాచారం. స్లిమ్‌గా మారడంతో పాటు పొడవాటి జుట్టుతో చరణ్ ఇప్పటివరకు కనిపించని ఒక సరికొత్త మేకోవర్‌లో దర్శనమివ్వనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టేందుకు సుకుమార్ ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా మొదటి భాగం స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్‌కి సంబంధించి క్లైమాక్స్ ఫైనల్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో సుకుమార్ టీమ్ నిమగ్నమై ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసే సాంకేతిక వర్గంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక కథానాయిక విషయానికొస్తే.. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటిస్తోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. చరణ్ సరసన సరైన భామను దించేందుకు ప్రస్తుతం కాస్టింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే ఆ హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించనున్నారు.
రంగస్థలం మ్యాజిక్‌ను మించి ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద సునామీ సృష్టించడానికి చరణ్-సుకుమార్ జోడీ సిద్ధమవుతోంది.

