Site icon NTV Telugu

Ram Charan: ‘కెజిఎఫ్ 2’ టీమ్ లో ఒక్కరిని కూడా వదలలేదే..

Charan

Charan

కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ .. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెజిఎఫ్ 2 ను ఆకాశానికెత్తేశాడు. ఇటీవలే కెజిఎఫ్ 2 ను వీక్షించిన చరణ్.. ట్విట్టర్ లో తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి పేరును మెన్షన్ చేసి మరీ చరణ్ చెప్పడం విశేషం.

” నా బ్రదర్ ప్రశాంత్ నీల్ కు మరియు హోంబలే పిక్చర్స్ వారికి మాసివ్ సక్సెస్ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.  రాఖీ.. డియర్ బ్రదర్ నీ నటన అద్భుతం.. ఆఫ్ స్క్రీన్ పై నీ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది.  సంజయ్ దత్ రవీనా టాండన్ మరియు ప్రకాష్ రాజ్ రావు రమేష్ లు తమ కెరీర్ బెస్ట్ ఇచ్చారు. శ్రీ నిధి శెట్టి, ఈశ్వరి రావు, అర్చన, మాళవిక అవినాష్ నటన బావుంది. రవి బస్సూర్ .. నీ పనితనం ఎంతో బావుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ పనితనాన్ని మెచ్చుకొంటున్నాను” అంటూ నిర్మాతల పేర్లను కూడా ట్యాగ్ చేశాడు. ఎవరిని వదలకుండా అందరి పేర్లు జోడించి ఔరా అనిపించుకున్నాడు. ఇక చరణ్ చేసిన ఈ పనికి అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఎంత మెమరీ అన్నా.. అన్ని పేర్లు ఎలా గుర్తుంచుకున్నావ్ అని కొందరు.. అన్నా కెజిఎఫ్ లో విలన్స్ నేమ్స్ మర్చిపోయావా..? అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

Exit mobile version