Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “ఇక అసలు ఆట మొదలవ్వబోతోంది” అంటూ చిత్ర బృందం అభిమానుల్లో పూనకాలు తెప్పించే వార్తను పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు (మిర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ‘రాంబుజ్జి’ అనే పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం అత్యంత భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సమ్మర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించేందుకు, ప్రేక్షకులకు పూర్తిస్థాయి మాస్ వినోదాన్ని పంచేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. దీంతో నెట్టింట అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
అందుకు తగ్గట్టుగానే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కన్నడ కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సీనియర్ నటులు బొమన్ ఇరానీ, జగపతి బాబు ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ‘రాంబుజ్జి’గా దివ్యేందు ఎంట్రీతో కాస్టింగ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచేందుకు స్టార్ కెమెరామెన్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా కొల్లా అవినాష్ పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, అలాగే జియో స్టూడియోస్ (జ్యోతి దేశ్‌పాండే) సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొత్తానికి జూన్ 4న ‘పెద్ది’ సృష్టించబోయే ప్రభంజనం కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Also Read
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!