Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘పుష్ప 2’ జరుగుతున్నప్పుడే బుచ్చిబాబు నాతో మాట్లాడారు. ‘పెద్ది’లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పారు. అది యాక్షన్ సీక్వెన్స్ కాదు కానీ యాక్షన్‌లా ఉండాలని అన్నారు. నాకు చాలా సర్ప్రైజ్‌గా అనిపించింది. అలా ఆ సీక్వెన్స్ కోసం గ్లింప్స్‌లో చూపించిన బ్యాటింగ్ స్టైల్ షాట్ కంపోజ్ చేశాను. అది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం బుచ్చిబాబు గారు నాకే ఇచ్చారు. ఆయనది చాలా మంచి మనసు. రామ్ చరణ్ గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే… మనం ఏం చెబుతున్నామో అది చాలా శ్రద్ధగా వింటారు. ఆయన టెక్నీషియన్లను చాలా బాగా నమ్ముతారు. ఇందులో ఆయన చాలా కష్టపడ్డారు. ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆయన బాడీ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, డైట్‌లో ఉంటూ ఆయన యాక్షన్ కోసం పడిన కష్టం మామూలుది కాదు. నియమాలు పాటిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఎంతో కష్టపడ్డారు. చరణ్ గారికి గాయం జరిగినప్పుడు నేను ఏడ్చేశాను. ఒక రోల్ మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు పొరపాటున అలా జరిగింది. ఈ సందర్భంగా చరణ్ గారి గొప్పతనం గురించి చెప్పాలి. ఆ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు పొరపాటు తనవైపే ఉందని ఓపెన్ గా చెప్పారు. నిజంగా ఏ హీరో కూడా అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కు ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేసుకుని మరుసటి రోజుకే షూటింగ్‌కు వచ్చేశారు. నేను షాక్ అయిపోయాను. ఒకసారి అనుకుంటే అది పూర్తవ్వాలి… అదే ఆయన కమిట్‌మెంట్, డెడికేషన్.