NTV Telugu Site icon

Ram Charan: ఇండియా నుంచి స్వామిమాలలో వెళ్లి.. అక్కడ ఈ డ్రెస్ ఏంటీ.. ఎలా?

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియా గర్వించదగ్గ విధంగా ఎదుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్.. ఇప్పుడు చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుకు హాజరు అయిన మొట్ట మొదటి భారతీయుడు రామ్ చరణ్. దానికన్నా ముందు జరగబోయే ఇంటర్వ్యూ కోసం చరణ్ నిన్ననే అమెరికాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఇంటర్వ్యూకి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. చరణ్ ను ఒక్కసారిగా చూస్తే హాలీవుడ్ స్టార్ అనుకోకుండా మానరు. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత అభిమానులకు ఒకే ఒక సందేహం తలెత్తుతోంది.

అదేంటంటే.. గత కొన్నిరోజులుగా చరణ్ స్వామి మాలలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన పాదరక్షలు విడిచి.. నల్ల దుస్తుల్లోనే కనిపించారు. నిన్న కూడా అమెరికాకు మాలలోనే వెళ్లారు.. మరీ ఈరోజు ఎలా వేరే డ్రెస్ లో కనిపించాడు అందరు తలలు కొట్టుకుంటున్నారు. మెడలో మాల ఉంటే సరిపోతుంది ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సరిపోతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే.. చరణ్ మాల తీసేశాడట. మాల వేసుకొని 21 రోజులు పూర్తి కావడంతో న్యూయార్క్ ఆలయంలో మాల తీసినట్లు చరణ్ పీఆర్ టీం తెలిపింది. స్వామి మాల తీసివేశాకనే చరణ్ ఈ లుక్ లో కనిపించాడు అన్నమాట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు రాకుండా చరణ్ మంచి పని చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments