మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన కన్పిస్తే చాలు ఎప్పటికప్పుడు స్టైలిష్ మేకోవర్ లో కన్పిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఈరోజు ఉదయం మన సౌత్ స్టార్ ఇండో వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. స్టైలిష్ ఆలివ్ గ్రీన్ కుర్తా ధరించి కనిపించిన చరణ్ దానిని నల్ల ప్యాంటుతో జత చేశాడు. దేశీ లుక్ కు ఈ కుర్తాతో మంచి టచ్ ఇచ్చాడు. బ్లాక్ ఫార్మల్ షూలతో పాటు కూల్ సన్ గ్లాసెస్‌తో ఉబెర్ కూల్ గా కన్పించాడు. ఫొటోగ్రాఫర్లకు చిరునవ్వుతో పోజులిచ్చిన చరణ్ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్సీ 15” షూటింగ్ లో ఉన్నారు. ముంబైలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో కియారా అద్వానీ, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, రెహమాన్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ పీరియాడికల్ డ్రామాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అలియా భట్, అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 2022 జనవరి 7న భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది.
