NTV Telugu Site icon

Mega Power Star Ram Charan: గోల్డెన్ గ్లోబ్ లో ఒక్క మగాడు

Charan

Charan

Mega Power Star Ram Charan: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను జక్కన్న అనౌన్స్ చేశాడో కానీ అప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఆర్ఆర్ఆర్ పేరు మోగుతూనే ఉంది. ఇక ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ అవార్డును అందుకోవడానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం లాస్ ఏంజిల్స్ కు వెళ్లిన సంగతి కూడా విదితమే. ఇక ఆ గోల్డెన్ గ్లోబ్స్ వేదికపై మన హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్రెస్సింగ్ అయితే వీర లెవల్ అని చెప్పాలి. ఆ లుక్ తోనే చరణ్ ఎస్క్వైర్ బెస్ట్ డ్రెస్స్డ్ మెన్ 2023 లిస్ట్ లో నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో ఈ రేసులో నిలబడలేదు. బెస్ట్ డ్రెస్స్డ్ మెన్ ఆఫ్ ది 2023 గోల్డెన్ గ్లోబ్ టాప్ 10 లిస్ట్ లో చరణ్ నిలవడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ డ్రెస్ విషయానికొస్తే.. తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన బ్లాక్ షేర్వాణీ. ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ నికితా జైసింఘని చరణ్ లుక్‌కి పనిచేయగా ప్రేరణ శ్రీకంఠప్ప అసిస్టెంట్ గా పనిచేసింది.

ఇక చరణ్ లుక్ గురించి ఆమె మాట్లాడుతూ.. ” తారక్ మోడ్రన్ కనిపించాలని బ్లాక్ సూట్ ఎంపిక చేశాం.. చరణ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ లో ఉండాలని కోరుకున్నాం. రెడ్ కార్పెట్‌పై ఇద్దరూ అద్భుతంగా కనిపించినప్పటికీ, రామ్ చరణ్‌కి అంతర్జాతీయ వేదికపై మన సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం చాలా ముఖ్యం అని అనుకున్నాం. చివరి నిమిషం వరకు చరణ్ ఫైనల్ లుక్ ఖరారు కాలేదు. కాగా, మేమెప్పుడూ ట్రెడిషనల్ లుక్, దేశానికి గర్వకారణమయ్యే రంగులను మేళవించాలని చూస్తాం. ఇక ఎన్నో రంగులు ట్రై చేసినప్పటికీ పూర్తిగా నలుపు రంగులో ఉన్న తరుణ్ తహిలియాని బంద్‌గాలా చరణ్ కు తగినట్లుగా మాకు అనిపించింది. అందులో చరణ్ చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆయనకు గోల్డెన్ గ్లోబ్ లో అత్యుత్తమ దుస్తులు ధరించిన పురుషులలో ఒకరిగా పేరు పొందడం మన దేశానికి భారీ విజయం” అని ఆమె చెప్పుకొచ్చింది.

Show comments