Ram Charan: గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చరణ్ ఓల్డ్ లుక్స్ షూటింగ్ లొకేషన్స్ నుంచి లీక్ అయ్యి మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాయి. షూటింగ్ అయితే గత ఏడాదిన్నరగా జరుపుకుంటూనే ఉంది కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలోనే క్లారిటీ మాత్రం లేకుండా పోయింది. ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావట్లేదు, షూటింగ్ అప్డేట్స్ తెలియట్లేదు, రిలీజ్ చేస్తామన్న సాంగ్ ని వాయిదా వేశారు… ఇలా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక్క సాలిడ్ స్టఫ్ కూడా రిలీజ్ కాలేదు.
ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే… ఆ ఒక్కటి అడక్కు అనే రేంజులో సమాధానాలు వినిపిస్తున్నాయి. 2024 సమ్మర్ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం… గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగా గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే కాస్త బ్రేక్ తీసుకోని… చరణ్ ఆర్సీ 16 స్టార్ట్ చేయనున్నాడట. బుచ్చిబాబు వచ్చే సమ్మర్ లోపు RC 16 రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈసారైనా గేమ్ చేంజర్ షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయి… ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!