NTV Telugu Site icon

Ram Charan: ‘దేవర’ రూట్‌లోనే ‘గేమ్‌ చేంజర్‌’…?

Ram Charan

Ram Charan

ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శంకర్ ‘గేమ్ చేంజర్’ కూడా సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న ఉన్నట్టుండి కెమెరా ముందుకి వచ్చేసి ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని చెప్పి షాక్ ఇచ్చాడు కొరటాల. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ లైనప్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అయినా కూడా అనుకున్న సమయానికి దేవర పార్ట్ 1 థియేటర్లోకి రానుంది. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా దేవర రూట్‌లోనే వెళ్తుందనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న శంకర్… మరోవైపు ఇండియన్ 2ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు.

Read Also: Bhagavanth Kesari: సెన్సార్ టాక్ వచ్చేసింది… బాలయ్య బొమ్మ పీక్స్‌ అంతే!

శంకర్ చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇదే కానీ ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. గత కొద్ది రోజులుగా ‘ఇండియన్‌ 2’ ఫుటేజ్ ఎక్కువగా వచ్చిందని… దీంతో ఇండియన్ 3 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్, ఇండియన్ 2 రెండు కూడా శంకర్ సినిమాలే కాబట్టి… రెండింటికి సీక్వెల్స్ రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది కానీ ఇందులో ఇండియన్ 3 మాత్రమే ఉంటుందట. గేమ్ చేంజర్ రెండు భాగాలనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది కానీ శంకర్ ఇన్ని రోజులుగా గేమ్ చేంజర్‌ను చెక్కుతున్నాడంటే.. కొరటాల లాగా సడెన్‌గా సీక్వెల్ అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Show comments