ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తర్వాత వెస్ట్రన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా… ఒక ఇండియన్ మూవీ చేరుకోని ప్రతి చోటుకి రీచ్ అవుతోంది. ఎమోషన్స్ ఎక్కడైనా ఒకటే అని నిరూపిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా అట్లాంటా నుంచి హాలీవుడ్ క్రిటిక్స్ వరకూ పోటీ చేసిన ప్రతి చోటా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరిల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అవార్డులు వస్తున్నాయి కానీ బెస్ట్ యాక్టర్ విభాగంలో చరణ్, ఎన్టీఆర్ లు నామినేట్ అయిన మొదటి ఈవెంట్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లోనే. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఈవెంట్ లో ఎన్టీఆర్, చరణ్ పేర్లు బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ యాక్షన్ హీరో కేటగిరిలో నామినేట్ అయ్యింది. ఈ కేటగిరిలో చరణ్, ఎన్టీఆర్ లకి పోటీగా నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఉన్నారు.
ఒక ఇండియన్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఇంటర్నేషనల్ స్టార్స్ తో కలిసి అవార్డ్ కోసం పోటీ పడతారు అని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఊహకందని ఆ కలని నిజం అవ్వడంతో చరణ్… “Delighted to see my brother @tarak9999 ‘s and my name on the nominees list of Best Actor in an Action Movie.
What a beautiful feeling to see our names next to legends like Nicolas Cage, Tom Cruise and Brad Pitt!” అని ట్వీట్ చేశాడు. మార్చ్ 16న ఈ అవార్డుని ఎవరు గెలిచారు అనే విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. చరణ్, ఎన్టీఆర్ లో ఎవరు ఈ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలిచినా, అదో కొత్త చరిత్రకి పునాదిగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
Delighted to see my brother @tarak9999 ‘s and my name on the nominees list of Best Actor in an Action Movie.
What a beautiful feeling to see our names next to legends like Nicolas Cage, Tom Cruise and Brad Pitt! https://t.co/FVVPx1lm9i— Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023
Honoured to be representing Indian Cinema at the @HCAcritics 2023 along with @ssrajamouli Garu & @mmkeeravaani Garu.
I’m proud of the recognition we received as team @RRRMovie tonight. pic.twitter.com/u44ee2peX5— Ram Charan (@AlwaysRamCharan) February 25, 2023