Site icon NTV Telugu

అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్

Anushpala

Anushpala

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అనుష్పల వివాహం ఆమె ప్రియుడితో నిన్న అట్టహాసంగా జరిగింది. ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పల వివాహం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది. అనుష్పాల, అర్మాన్‌ల వివాహానికి ముందు జరిగిన ఫంక్షన్‌ల నుండి బయటకు వచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సెలబ్రిటీ జంట రామ్ చరణ్, ఉపాసన కుటుంబం రాయల్ లుక్ లో అదిరిపోయేలా కన్పించింది.

Read Also : సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డు… తగ్గని “జై భీమ్” జోరు

పెళ్లికి, రామ్ చరణ్ క్రీం కలర్ షేర్వాణిని ధరించగా, ఉపాసన భారీగా అలంకరించబడిన షరారా సెట్‌ను ఎంచుకుంది. తన సోదరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ ఉపాసన “నిజంగా నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. చాలా కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరి మీకు శుభాకాంక్షలు… నేను మీ ప్రేమలో మునిగిపోయాను” అంటూ పోస్ట్ చేసింది. అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని. అర్మాన్ ఇబ్రహీం మాజీ ఇండియన్ ఎఫ్3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం కుమారుడు, చెన్నైకి చెందిన కార్ రేసర్.

Exit mobile version