NTV Telugu Site icon

Ram Charan: వైజాగ్ లో సందడి చేస్తున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ .. ఫ్యాన్స్ కు పండగే ..

Cherry Bunny

Cherry Bunny

సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది.

అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెలాఖరు వరకు వైజాగ్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటారు. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.. అల్లు అర్జున్, రాంచరణ్ పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత తొలిసారి తమ చిత్రాల షూటింగ్ వైజాగ్ లో చేస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆ జోష్ మామూలుగా లేదు.. ఇద్దరి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు..

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ చాలా కాలం నుంచి జరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఇకపై వేగం పెంచాలని డైరెక్టర్ శంకర్ కూడా భావిస్తున్నారు. ఆల్రెడీ శంకర్ పై, నిర్మాత దిల్ రాజుపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వైజాగ్ షెడ్యూల్ గేమ్ ఛేంజర్ కి పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తుందని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరాకెక్కిస్తున్నారు.. త్వరలోనే సినిమా విడుదల పై మరో అప్డేట్ రానుంది..