NTV Telugu Site icon

Ram Charan: ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్.. తన ఫేవరేట్ రెసిపీ ఏంటంటే.. ?

Charan

Charan

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే.. సినిమాలపరంగా హీరోలు పోటీ పడతారు తప్ప రియల్ గా ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఇక ముఖ్యంగా రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, రానా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరందరూ చిన్నతనం నుంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ హీరోలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కు సిద్దమవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా కోసం అనుష్క ప్రత్యేక్షంగా ప్రమోషన్స్ చేయకపోయినా.. పరోక్షంగా తనవంతు కృషి చేస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తో అనుష్క తనకు నచ్చిన ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరింది. ప్రభాస్ .. తనకు నచ్చిన రెసిపీని రాసి పంపాలని ఛాలెంజ్ చేసింది.

Nandamuri Mokshagna: ఓ.. బాలయ్య.. కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఉందా.. ఎన్నాళ్లు దాస్తావయ్యా.. ?
ఇక అనుష్క చెప్పడం.. ప్రభాస్ చేయకపోవడమా .. ? అన్నట్లు వెంటనే .. తనకు నచ్చిన రొయ్యల పులావ్ ఎలా చేయాలో చెప్పుకురావడమే కాకుండా తన ఫ్రెండ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరాడు. ఇక తాజాగా ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్ తన ఫెవరేట్ రెసిపీ నెల్లూరు చేపల పులుసు అని, అది ఎలా చేయాలో చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా భల్లాలదేవా రానాకు చరణ్ ఛాలెంజ్ విసిరాడు. మరి రానా తన ఫెవరెట్ రెసిపీ ఏంటో.. ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే.. రానా ఛాలెంజ్ ను స్వీకరించేవరకు ఆగాల్సిందే. చాలా గ్యాప్ తరువాత అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా స్వీటీకి ఎలాంటి విజయాన్నీ అందిస్తుందో చూడాలి.

Show comments