Site icon NTV Telugu

Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

Ram

Ram

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ఈ సినిమా నుంచి విజిల్ అనే మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాంతో పాటు ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రామ్ అందరి గురించి మాట్లాడి డైరెక్టర్ లింగుసామిని మర్చిపోయాడు.

మెయిన్ డైరెక్టర్ గురించి మాట్లాడకుండా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ చివరికి అభిమానుల గురించి కూడా మాట్లాడాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించేలోపు టైమ్ అయిపోయింది. దీంతో డైరెక్టర్ లింగుసామికి సారీ చెప్తూ రామ్ ట్వీట్ చేశాడు. ” అన్ని మాటలు చెప్పి మొత్తం కంగారులో మెయిన్ మ్యాన్ గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, నా డైరెక్టర్, నా సినిమాను తన భుజాలపై మోసిన వ్యక్తి. లింగుసామి సర్.. ఇప్పటివరకు నేను పనిచేసిన బెస్ట్ డైరెక్టర్ లో మీరు కూడా ఒకరు.. క్షమించండి.. లవ్ యూ” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version