Ram New Movie: ఇటీవలే ఉస్తాద్ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘ది వారియర్’ మూవీ చేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు. గతంలో రామ్, తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ సినిమాను ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. దాంతో ఆ తర్వాత నానితో గౌతమ్ మీనన్ తెలుగు సినిమా చేశాడు. అప్పటి నుండీ రామ్ తో టచ్ లోనే ఉన్న గౌతమ్.. ఇటీవల రామ్ కు ఓ కథ చెప్పాడట. దానికి అతను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని స్రవంతి రవికిశోర్ తీయబోతున్నారట. ఈ విషయాన్ని ‘ముత్తు’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా గౌతమ్ మీనన్ తెలిపాడు. తామిద్దరి మధ్య వారధిలా రవికిశోర్ ఉన్నారని, ఆయనే ఈ సినిమాను వచ్చే యేడాది వేసవిలో మొదలు పెట్టవచ్చని చెప్పాడు. ఇదిలా ఉంటే.. శింబు హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కించిన ‘ముత్తు’ మూవీని తెలుగులో రవికిశోర్ ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.
