NTV Telugu Site icon

Rakul Preet Singh: 250 కోట్ల అప్పుల ఊబిలో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. షాకింగ్ నిర్ణయం!

Rakul Family Losses

Rakul Family Losses

Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్‌లలో ఒకటైన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు భగ్నాని యొక్క పూజా ఎంటర్‌టైన్‌మెంట్ పెద్ద ఆర్థిక వైఫల్యం నుండి కోలుకోవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, వాషు భగ్నాని తన ఏడు అంతస్తుల పూజా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయాన్ని ఒక బిల్డర్‌కు విక్రయించాడు. అయితే ఈ భూమిని కొనుగోలు చేసిన బిల్డర్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. ఈ భవనాన్ని కూల్చివేసి విలాసవంతమైన ఒక నివాస భవనాన్ని నిర్మిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!

వాషు తన ఉద్యోగులలో దాదాపు 80% మందిని తొలగించి, కార్యాలయాన్ని జుహులోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ నటించిన జగన్ శక్తి చిత్రం రెండేళ్ల పోరాటం తర్వాత 2024 జనవరిలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ముఖ్యంగా బడే మియాన్ ఛోటే మియాన్ విడుదలైన తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించింది. బడే మియాన్ ఛోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. రూ.350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం టిక్కెట్ విండో వద్ద కేవలం రూ.59.17 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల ప్రొడక్షన్ బ్యానర్‌కి కనీసం 125-150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. పలువురు ఫైనాన్షియర్లకు సుమారు రూ. 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాషు ఈ భవనాన్ని విక్రయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ రిలీజ్ అయ్యాక 2024 జనవరిలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఏప్రిల్‌లో ముఖ్యంగా బడే మియాన్ ఛోటే మియాన్ విడుదలైన తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించిందని అంటున్నారు. బడే మియాన్ ఛోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. .350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం టిక్కెట్ విండో వద్ద కేవలం రూ.59.17 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల ప్రొడక్షన్ బ్యానర్‌కి కనీసం 125-150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. పలువురు ఫైనాన్షియర్లకు సుమారు రూ. 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాషు ఈ భవనాన్ని విక్రయించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Show comments