Rakshita Suresh Met With An Accident In Malaysia: ప్రముఖ సింగర్ రక్షిత సురేశ్ ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. మలేషియాలో ఎయిర్‌పోర్టుకి వెళ్తున్న సమయంలో.. దురదృష్టవశాత్తు ఆమె కారు డివైడర్‌ను ఢీకొంది. అయితే.. కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ పుణ్యమా అని ఆమె ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడింది. ఈ సంఘటన గురించి ఆమె ట్విటర్ మాధ్యమంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో తన కళ్లముందు జీవితమంతా మెదిలిందని.. కేవలం ఎయిర్‌బ్యాగ్స్ కారణంగా తాను ఈ పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చింది. ‘‘నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను. ఆదివారం ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు.. నా కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో నా జీవితమంతా కళ్లముందు మెదిలింది. కార్‌లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ నా ప్రాణాలు కాపాడాయి. ఒకవేళ అవి లేకపోయి ఉంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సంఘటనని తలచుకుంటే, ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాదంలో నేను, డ్రైవర్, మరో ప్యాసింజర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినందుకు మేము అదృష్టవంతులం’’ అంటూ రాసుకొచ్చింది.
Saif Ali Khan: అందుకు ఒప్పుకోలేదని.. సినిమా నుంచి తొలగించేశారు
కాగా.. రక్షిత సురేశ్ ఓ ప్రముఖ తమిళ సింగర్. 2009లో రిథమ్ తధిమ్, లిటిల్ స్టార్ సింగర్ విజేతగా అవతరించిన ఈమె.. సూపర్ సింగర్ 6 రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచింది కూడా! శింబు కథానాయకుడిగా హిప్‌హాప్ తమిళ స్వరపరిచిన వంత రాజువదాన్ వరువెన్ సినిమాతో ఆమె గాయనిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంతకుముందు కూడా కొన్ని పాటలు పాడింది కానీ, ఆ ఆఫర్ పుణ్యమా అని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి తమిళం, హిందీ, కన్నడ, తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 కన్నడ వర్షన్‌లోనూ పలు పాటలు పాడింది.
Yuzvendra Chahal: చాహల్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా..