NTV Telugu Site icon

Rakesh Master: నేను చనిపోతానని ముందే తెలుసు.. కన్నీరు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి మాటలు

Rakeshhh

Rakeshhh

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నేడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు రాకేష్ మాస్టర్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాకేష్ మాస్టర్ పాత వీడియోలను, ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. తాజాగా అందులో ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో తన చావు తనకు తెలిసిపోయిందని రాకేష్ మాస్టర్ చెప్పడం కంటనీరు తెప్పిస్తోంది. రాకేష్ మాస్టర్ వద్ద పుల్లయ్య అనే కుర్రాడు డ్యాన్స్ నేర్చుకున్న విషయం తెల్సిందే. అచ్చు గుద్దినట్లు గురువు గారిలానే ఆ కుర్రాడు కూడా రెడీ అవుతూ.. కొన్ని వీడియో లు పోస్ట్ చేస్తూ ఉంటాడు.

Rakesh Master: రాకేష్ మాస్టర్ అసలు పేరు ఏంటో తెలుసా..?

ఇక రెండు వారాల క్రితం.. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ” నా శరీరంలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. నీ శరీరంలో పటిష్టమైన మార్పులు వస్తున్నాయి. నాకు తెలుసు నేను చూస్తున్నాను. నువ్వు ఉదయించే సూర్యుడివి.. నేను అస్తమించే సూర్యుడిని.. నాకు అని తెలుసు. అన్ని తిరిగిన తరువాత ఈ హాస్పిటల్ ఏంటి రా కర్మ కాకపోతే.. మీ అమ్మగారిని, వదినమ్మ గారిని జాగ్రత్తగా చూసుకో” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

https://youtube.com/shorts/6AVlViwoJ5I?feature=share